’రోహిత్ కు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్థం కావడం లేదు. విరాట్ మాత్రం గత ఏడాదిన్నర కాలంగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ తో బిజీగా ఉన్నాడు. కానీ రోహిత్ విషయం అలా కాదు. అతడు గత కొంత కాలంగా క్రికెట్ ఆడుతూ మధ్య మధ్యలో గాయాలతో బ్రేక్స్ తీసుకుంటూనే ఉన్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్ నుంచి మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా గాయంతో వెళ్లలేదు.