ICC World Cup 2019 | ఆరెంజ్ జెర్సీలో తళుక్కుమన్న టీమిండియా క్రికెటర్లు...సాహో అంటున్న అభిమానులు...
గత కొన్ని రోజులుగా సస్పెన్స్ మధ్య కొనసాగుతున్న టీమిండియా ఆరెంజ్ జెర్సీ డిజైన్ ఎట్టకేలకు విడుదలైంది. సుదీర్ఘకాలంగా బ్లూ జెర్సీలో కనిపించిన టీమిండియా క్రికెట్లర్లు, ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం నీలం, ఆరెంజ్ రంగుతో కూడిన జెర్సీలో కనిపించనున్నారు. అయితే ఈ కొత్త జెర్సీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా టీమిండియా సభ్యులంతా తళుక్కున మెరిసారు. జట్టు అఫీషియల్ స్పాన్సర్ నైకీ సంస్థ తయారు చేసిన ఆరెంజ్ జెర్సీ డిజైన్ అందరినీ ఆకట్టుకుంది.