TEAM INDIA MAY PLAY ITS FIRST MATCH WITH SRILANKA AFTER CORONAVIRUS CRISIS AK
కరోనా తరువాత కొహ్లి సేన ఆడే మొదటి మ్యాచ్ వారితోనే..
కరోనా తరువాత కొహ్లి సేన ఆడబోయే తొలి మ్యాచ్ కూడా శ్రీలంకతోనే అని తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో శ్రీలంకతో టీమిండియా టి20 సిరీస్ జరగనుంది. ఆగస్టులో ఈ సిరీస్ ఉండొచ్చని సమాచారం.
కరోనా కారణంగా అన్ని ఆగిపోయినట్టే క్రికెట్ మ్యాచ్లు కూడా ఆగిపోయాయి. ఐపీఎల్ రద్దు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇక అక్టోబర్లో అస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఉంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ నెలలో శ్రీలంక టూర్కు వెళ్లాల్సిన టీమిండియా... కాస్త ఆలస్యంగా అయినా వారితో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నట్టు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
కరోనా తరువాత కొహ్లి సేన ఆడబోయే తొలి మ్యాచ్ కూడా శ్రీలంకతోనే అని తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో శ్రీలంకతో టీమిండియా టి20 సిరీస్ జరగనుంది. ఆగస్టులో ఈ సిరీస్ ఉండొచ్చని సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
‘ది ఐలాండ్’ రిపోర్ట్ ప్రకారం కొద్దిరోజుల క్రితం ఈ టూర్కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఓకే చెప్పిన తరువాతే ఇందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినట్టు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
శ్రీలంక క్రికెట్ బోర్డు వారి క్రీడాశాఖ అనుమతి తీసుకుని బీసీసీఐతో చర్చలు జరపనుందని తెలుస్తోంది. వాస్తవానికి జూన్లో శ్రీలంక టూర్కు వెళ్లాల్సిన టీమిండియా... వారితో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ ’లు ఆడాల్సి ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
అయితే కాస్త ఆలస్యంగా అయినా ఈ సిరీస్ జరిగితే తమకు రెవెన్యూ వస్తుందని శ్రీలంక బోర్డు ఆశిస్తోంది. స్టేడియంలో ఆడియెన్స్ లేకుండా మ్యాచ్లు ఆడేందుకు కూడా శ్రీలంక బోర్డు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇస్తే... 30 నుంచి 40 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే యోచనలో అక్కడి క్రికెట్ బోర్డు ఉన్నట్టు ది ఐలాండ్ పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)