Team India : మరో ఆర్సీబీలా తయారైన టీమిండియా.. అందుకే ఇలా జరుగుతుందా?
Team India : మరో ఆర్సీబీలా తయారైన టీమిండియా.. అందుకే ఇలా జరుగుతుందా?
Team India : విరాట్ కోహ్లీ, ఏబీ డీవిలియర్స్, క్రిస్ గేల్, రాస్ టేలర్, కెవిన్ పీటర్సన్, మ్యాక్స్ వెల్ లాంటి బిగ్ ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్ గా నిలువలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008లో ఘనంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే 15 సీజన్లను పూర్తి చేసుకుంది. నాలుగు జట్లు (ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ, లక్నో) మినహా మిగిలిన 6 జట్లు కూడా ఐపీఎల్ టైటిల్ ను కనీసం ఒక్కసారి అయినా నెగ్గాయి.
2/ 8
విరాట్ కోహ్లీ, ఏబీ డీవిలియర్స్, క్రిస్ గేల్, రాస్ టేలర్, కెవిన్ పీటర్సన్, మ్యాక్స్ వెల్ లాంటి బిగ్ ప్లేయర్లు ప్రాతినిధ్యం వహించినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్ గా నిలువలేదు.
3/ 8
ప్రతి సారి ‘ఈ సాలా కప్ నామ్ దే’ అని టోర్నీలో అడుగుపెట్టడం ఒట్టి చేతులతో టోర్నీ నుంచి నిష్క్రమించడం ఆర్సీబీకి ఆనవాయితీగా వస్తుంది. అలా అని ఆర్సీబీ దారుణ ప్రదర్శన చేస్తుందా అంటే అదీ లేదు.
4/ 8
15 సీజన్లలో 8 సార్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. 2009, 2011, 2016 ఎడిషన్ లలో ఫైనల్స్ కు చేరుకుంది. అయితే తుది మెట్టుపై బోల్తా పడి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
5/ 8
ఇక గత మూడు సీజన్లలో కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటూ వస్తోంది. అయితే ప్లే ఆఫ్స్ లో ఓడి ఇంటిదారి పడుతుంది. లీగ్ దశలో టాపర్ గా నిలవడం.. ప్లే ఆఫ్స్ లేదా ఫైనల్లో చతికిలపడటం ఆర్సీబీకి వెన్నతో పెట్టిన విద్య.
6/ 8
ప్రస్తుతం టీమిండియా పరిస్థితి కూడా అలానే తయారైంది. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్ గా నిలిచిన తర్వాత నుంచి భారత్ మరో ఆర్సీబీలా మారింది. ఐసీసీ టోర్నీల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం.. లీగ్ దశలో అదరగొట్టడం.. ఆ తర్వాత సెమీస్ లేదా ఫైనల్స్ లో చేతులెత్తేయడం ఆనవాయితీగా వస్తుంది.
7/ 8
2014 టి20 ప్రపంచకప్ .. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరిన భారత్.. చివరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్ గా నిలిచింది. ఇక 2015 వన్డే, 2016 టి20, 2019 వన్డే, 2022 టి20 ప్రపంచకప్ లలో సెమీస్ లో చిత్తయ్యింది.
8/ 8
కోహ్లీ, రోహిత్, ధోని, హార్దిక్ పాండ్యా, బుమ్రా, షమీ లాంటి స్టార్ ప్లేయర్లు జట్టులో ఉంటున్నా టీమిండియా రాత మాత్రం మారడం లేదు. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నారే కానీ మ్యాచ్ విన్నర్లు లేకపోవడం భారత పరాజయాలకు ముఖ్య కారణంగా కనిపిస్తుంది.