జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 68 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డేల్లో 16 బంతుల్లో 4.. 14 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 77 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అయితే వర్షంతో రద్దయిన రెండో వన్డేలో 10 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక శిఖర్ ధావన్ ఓపెనింగ్ స్థానం కోసం శుబ్ మన్ గిల్ తో పాటు ఇషాన్ కిషన్ లు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ధావన్ తన స్ట్రయిక్ రేట్ తో పాటు నిలకడ ప్రదర్శించాల్సి ఉంది. లేదంటే టీమిండియాకు దూరం కావాల్సిందే.
రిషభ్ పంత్ కూడా ప్రస్తుతం ఏ మాత్రం ఫామ్ లో లేడు. అతడిని డ్రాప్ చేయాలంటూ బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం (125 నాటౌట్) బాదిన తర్వాత వరుస పెట్టి విఫలం అవుతున్నాడు. లిమిటెడ్ ఓవర్ క్రికెట్ లో పంత్ ఆఖరి ఐదు ఇన్నింగ్స్ లను చూస్తే వరుసగా 3, 6, 6, 11, 15గా ఉంది. పంత్ ను తప్పించి సామ్సన్ కు అవకాశం ఇవ్వాలంటూ బీసీసీఐకి సలహాలు పెద్ద ఎత్తును అందుతున్నాయి.
ఇక ఈ జాబితాలో ఉన్న మూడో ప్లేయర్ శార్దుల్ ఠాకూర్. శార్దుల్ నిలకడగా రాణించి ఉంటే టీమిండియాకు మంచి ఆల్ రౌండర్ గా మారే వాడు. శార్దుల్ ప్రధాన సమస్య నిలకడలేమి. ఒక మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి.. ఆ తర్వాతి మ్యాచ్ లో తేలిపోతాడు. ముఖ్యంగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు. బుమ్రా రేపో మాపో పునరాగమనం చేయడం పక్కా. అతడితో పాటు సిరాజ్, షమీ, భువీ, అర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చహర్ లు ఉండటంతో శార్దుల్ కు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమే.