అదే సమయంలో వరుసగా విఫలం అవుతున్న అక్షర్ పటేల్ కు పదే పదే అవకాశాలు ఇచ్చాడు. ఆఖరికి సెమీస్ లో కూడా చహల్ కు అవకాశం ఇవ్వలేదు. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఏకంగా ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగి సఫలం అయ్యింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన బీసీసీఐ ద్రవిడ్ ను సాగనంపేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.