భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ అందం పరంగా బాలీవుడ్ హీరోయిన్ కంటే తక్కువేమీ కాదు. ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పంచుకుంటుంది. సోషల్ మీడియాలో సారాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా లో 20 లక్షల మందికిపైగా ఆమెను ఫాలోయివుతుంటారు. తాజాగా సారా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ప్రత్యేక చిత్రాన్ని షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులకు సారా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో తోడి పెళ్లికూతురుగా మారబోతోందని తెలిసింది. (Imagecredit : Instagram)
సారా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటమే కాకుండా చాలా ట్రావెల్ చేస్తుంది. ఆమె కొత్త నగరాలకు వెళ్లడానికి ఇష్టపడుతోంది. ఇటీవల, సెలవులకు థాయ్‌లాండ్‌లోని కో సముయ్ అనే చిన్న ద్వీపానికి వెళ్లింది. ఈ ద్వీపం విలాసవంతమైన రిసార్ట్లు, అందమైన బీచ్‌లు మరియు వర్షారణ్యాలకు ప్రసిద్ధి చెందింది. అందుకు సంబంధించిన చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసింది సారా. (Imagecredit : Instagram)
థాయ్‌లాండ్ పర్యటనలో.. సారా తన కొత్త రూపాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇందులో ఆమె హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా కన్పిస్తోంది. సారా థాయ్‌లాండ్ నుంచి పంచుకున్న ఫోటోల్లో ఆమె స్నేహితుల్లో ఒకరు కూడా కన్పించారు. ఆమె పేరు మేఘనా కౌర్. ఆమె పెళ్లిలోనే సారా తోడి పెళ్లికూతురుగా మారనుంది.(Imagecredit : Instagram)