ఇక తాజాగా విరాట్ కోహ్లీని పట్టుకుని ’చమియా నాచ్ రహీ హై‘ అంటూ కోహ్లీని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు. చమియా అంటే అందమైన అమ్మాయి డ్యాన్స్ చేయడం అని అర్థం. సెహ్వాగ్ ఆ కామెంట్ చేయడంతో కోహ్లీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. సెహ్వాగ్ ను వెంటనే కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించాల్సిందిగా సోనీ నెట్ వర్క్ కు సూచిస్తున్నారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆడే సమయంలో సెహ్వాగ్ కోహ్లీపై నోరు జారాడు. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో స్టువర్ట్ బ్రాడ్ (1) రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. మైదానంలో దూకుడుగా కనిపించే కోహ్లీ.. బ్రాడ్ వికెట్ ను డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. కోహ్లీ డ్యాన్స్ పై సెహ్వాగ్ ఆ రకంగా కామెంట్ చేశాడు.