టీమిండియా (Team India)లో ఎన్నో రోజుల నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma) - విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఒక ప్రచారం హాట్ టాపిక్ గానే ఉంది. భారత క్రికెట్ లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. అందుకే ఒకరితో ఒకరు కనీసం మాట్లాడడం కూడా లేదని టాక్ కూడా వినిపించింది.
ఇటీవలే విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మ ను కొత్తగా కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అంతే కాకుండా భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య వివాదం ముదిరి పోవడంతో ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడటానికి ఆసక్తి చూపడం లేదు అంటూ ప్రచారం జరిగింది.
ఆ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న పుకార్లను లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొట్టి పారేశాడు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రవర్తించిన తీరే వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పడానికి నిదర్శనమని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన గవాస్కర్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డాడు.
" రోహిత్, కోహ్లీ ఇద్దరూ టీమిండియా కోసం చాలా కష్టపడుతున్నారు. మైదానంలో ఇద్దరూ చాలా క్లోజ్ గానే ఉంటున్నారు. జట్టు కోసం కష్టపడే వాళ్లిద్దరి మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి? ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీడియాలో వీళ్ల గురించి వస్తున్నవన్నీ పుకార్లే. చాలా ఏళ్లుగా అవే ప్రచారం అవుతున్నాయి. ఇక, టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయవంతం కాకూడదని కోహ్లీ కోరుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అదంతా నాన్సెన్స్.