టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు రెండు స్తంభాలు లాంటి వారు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma). గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో వీరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువ. విరాట్ కోహ్లీ తన సూపర్ బ్యాటింగ్ తో జట్టును విజయాల బాట పట్టిస్తున్నాడు. ఇక, టీమిండియా విజయాల్లో కీ రోల్ రోహిత్ శర్మదే. స్వదేశం, విదేశాలని లేకుండా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు హిట్ మ్యాన్.
" రాహుల్.. నీలో ఉన్న విధ్వంసకర ఆటగాడిని ఇన్నాళ్లు ప్రపంచానికి ఎందుకు పరిచయం చేయలేదు. నీ ఆటను చూసి ప్రపంచమే మురిసిపోతోంది. కోహ్లీ, రోహిత్ శర్మల కంటే ఎక్కువగా నీ ఆటతీరు గురించే చర్చిస్తున్నారు. మిగతా మ్యాచుల్లో కూడా ఇలాగే ఆడి ఉంటే పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరి ఉండేది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే గొప్ప శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నీ షాట్లలో గొప్ప వైవిధ్యం ఉంది " అని గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు.