ప్రస్తుతం రిషభ్ పంత్ (Rishabh Pant)కు కష్టకాలం నడుస్తోంది. కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే బ్యాటర్ గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా (Hardik Pandya), దినేశ్ కార్తీక్ (Dinesh Karthik)లు టీమిండియా (Team India)లోకి పునరాగమనం చేయడం.. ఫినిషర్లుగా అదరగొట్టడంతో పంత్ పై విమర్శలు ఎక్కువయ్యాయి.