ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలోని టైటాన్స్ (Gujarat Titans)దుమ్మురేపుతోంది. ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చినా తగ్గేదే లే అన్నట్టు అద్భుతంగా రాణిస్తూ పాయింట్ల టేబుల్ లో టాప్ ప్లేసులో నిలిచింది. 20 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో స్థానం దక్కించుకోవడమే కాకుండా.. ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
హార్దిక్ ప్రస్తుతం ఫినిషర్‌గా కాకుండా మూడు లేదా నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ స్థానంలో మంచి స్కోర్ చేసి జట్టును ఆదుకోవాలి. అయితే గత ఐదు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అతని ఫిట్‌నెస్‌పై కూడా అనుమానాలు వీడలేదు. గత ఆరు మ్యాచ్‌ల్లో హార్దిక్ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. టీమిండియాకు ఆడాలంటే.. హార్ధిక్ బౌలింగ్ కూడా వేయాల్సిందే.
ఆ తర్వాత టీమ్ ఇండియాలో స్థానం కోల్పోయాడు. ఆల్ రౌండర్ గా ఆడాలంటే బౌలింగ్ లో నిలకడ కనబరచాలి. అదే విధంగా కేవలం బ్యాట్స్‌మెన్‌గా ఆడాలంటే, చాలా పరుగులు చేయాలి. అందుకే భారత్ జట్టులో హార్ధిక్ ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ప్రశ్నకు గుజరాత్ టైటాన్స్‌తో మిగిలిన మ్యాచ్‌ల్లో హార్ధిక్ నే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.