యువరాజ్ సింగ్ ఈ పేరు చెప్పగానే ఆరు బంతుల్లో ఆరు సిక్సులే.. సిక్సర్ల కింగ్ గా.. వర్లడ్ కప్ ను గెలిపించిన ఆల్ రౌండర్ గా.. రియల్ లైఫ్ లో క్యాన్సర్ ను జయించిన హీరోగా.. అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానముంది. క్రికెట్ దూరమైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటున్నాడు యువీ.. అయితే యువరాజ్ సింగ్, నటి హాజెల్ కీచ్ వివాహం జరిగి మంగళవారం నాటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 5వ వార్షికోత్సవం సందర్భంగా హాజెల్ కీచ్ తన వివాహ ఆల్బమ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే ఈ ఫోటో వైరల్ అయ్యింది..
వారి ఐదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట విదేశాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా తాము మొదటిసారి కలుసుకున్నప్పుడు తనకు ఏమి తెలియదని, కానీ తన జీవితం శాశ్వతంగా మారుతుందని అప్పుడు తెలుసుకోలేకపోయాను అంటూ కామెంట్ చేసింది హాజెల్ కీచ్. తాను ఎన్నడూ చూడని అతిపెద్ద మార్పుకు 5 సంవత్సరాల్లో వచ్చిందని అన్నారు. హాజెల్ కీచ్, యువరాజ్ సింగ్ 2016 నవంబర్ 30న వివాహం చేసుకున్నారు.
2016లో సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పి, క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను పెళ్లాడింది హాజెల్ కీచ్... అయితే యువీ పెళ్లాడకముందు నుంచే ఆమె డిప్రెషన్‌తో బాధపడుతోందట. 22 ఏళ్ల వయసు నుంచే తాను డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నానని ప్రకటించింది హజల్ కీచ్.. ఇటీవల తాను ఎదుర్కొంటున్న మానసిక సమస్య గురించి.. తన ప్రేమ గురించి అన్ని విషయాలు పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చింది ఆమె.
1987, ఫిబ్రవరి 28న ఇంగ్లాండ్‌లో జన్మించిన హజల్ కీచ్ కు ప్రస్తుతం 34ఏళ్లు. నటిగా వెండితెరపై వెలిగిపోవాలని కోటీ ఆశలతో బాలీవుడ్లో అడుగుపెట్టిన హజల్కీచ్కి ఆశించినంతగా అవకాశాలు మాత్రం రాలేదు ఆడపాదడపా సినిమాల్లో నటించినా, మెయిన్ హీరోయిన్గా కానీ, కీ రోల్లో కానీ కనిపించలేకపోయింది హజల్కీచ్. ఆమె చేసినవన్నీ సైడ్ క్యారెక్టర్లు, ఐటెం సాంగ్ స్పెషల్ అప్పీరియెన్స్లే.
2016, నవంబర్ 30న యువరాజ్ సింగ్, హజల్ కీచ్‌ల వివాహం జలంధర్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగింది. ఆ తర్వాత గోవాలో మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారీ ఇద్దరు. యువరాజ్ సింగ్ రిసెప్షన్ పార్టీకి భారత క్రికెటర్లు అందరూ హాజరయ్యారు. అయితే వీరి ప్రేమ స్టోరీలో ఓ ట్విస్ట్ ఉన్నట్టు ఆమె స్వయంగా గతంలో చెప్పింది..
హజల్ కీచ్‌ను కాఫీ డేట్‌కి పిలిచేందుకే మూడేళ్ల పాటు యువరాజ్ సింగ్ కష్టపడ్డాడని ఆమె చెప్పుకొచ్చింది. యువీ అడిగిన వెంటనే కాఫీకి వస్తానని చెప్పిన హజల్ కీచ్, సరిగ్గా ఆ రోజు వచ్చేసరికి ఫోన్ స్విచ్ఛాప్ అయ్యిందంట.. దీంతో యువరాజ్ సింగ్‌కి చిర్రెత్తుకొచ్చి, ఆమె ఫోన్‌నెంబర్‌ను డిలీట్ చేసేశాడని.. కానీ తరువాత ఫేస్బుక్ ద్వారా మళ్లీ పరిచయం ఏర్పడిందని.. యువీ పంపిన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను మూడు నెలల తర్వాత అంగీకరించిన హజల్కీచ్ చెప్పింది. కానీ ఆ తరువాత అతడి ప్రేమలో పడినట్టు ఆంగీకరించింది.
తనకు నవ్వుతూ మాట్లాడేవారంటే చాలా ఇష్టమని.. అలావారితో కలవాడని నేనెంతో ఇష్టపడతాను అన్నారు. తన ముఖంలో ఎప్పుడూ నవ్వు కనిపించేలా జాగ్రత్త పడతను అన్నారు. అలా చేస్తే తన ఆకలిని, సమస్యలను నవ్వుతో కప్పేస్తాను అన్నారు. అయితే యువరీజ్ సింగ్ తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. జీవితం ఇంత హ్యాపీగా ఉంటుందని తెలిసి వచ్చిందని అన్నారు. తాను ఎప్పుడూ ఇంత ఆనందంగా, ఇంత ఆరోగ్యంగా ప్రశాంతమైన జీవితం గడుపుతానని అనుకోలేదు అన్నారు. ఈ సంతోషానికి యువరాజే కారణమంటూ చెప్పుకొచ్చారు హాజెల్ కీచ్..