టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టి మధ్య ఎన్నాళ్లు గానో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. వీరిద్దరూ తరచూ ఒకరి ఫొటోలు ఒకరు షేర్ చూస్తూ ఉంటారు. పుట్టిన రోజులు, స్పెషల్ అకేషన్లకు ఒకరిని ఒకరు విష్ చేస్తుంటారు. కానీ ఇంత వరకు బయటకు మాత్రం తమ రిలేషన్షిప్ గురించి ఎక్కడా చెప్పలేదు. (PC: Instagram)
భారత జట్టుతో కలసి ఇంగ్లాండ్ వెళ్లిన కేఎల్ రాహుల్.. డబ్ల్యూటీసీ తుది జట్టులో స్థానం దక్కించుకోలేక పోయాడు. అయితే తన ప్రియురాలిగా చెప్పబడుతున్న అథియాతో కలసి ఉన్న ఫొటోనే షేర్ చేశాడు. అదే ఫొటోను అథియా శెట్టి కూడా షేర్ చేయడం గమనార్హం. వీరిద్దరూ సన్ గ్లాసెస్ ధరించి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది. (PC: Instagram)