టీమిండియా (Team India) స్టార్ పేసర్ దీపర్ చహర్ (Deepak Chahar) భార్య జయ భరద్వాజ్ (Jaya Bharadwaj)ను చంపేస్తామంటూ దుండగుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షల రూపాయలను అడిగినందుకు ఆమెను చంపేస్తామంటూ కాల్స్ వచ్చినట్లు సమాచారం. (PC : Jaya Bharadwaj/Instagram)
పారిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పారిక్, కమలేష్ పారిఖ్ లు రూ. 10 లక్షల రూపాయలను దీపక్ చహర్ భార్య జయ భరద్వాజ్ దగ్గర నుంచి తీసుకున్నట్లు దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో రూ. 10 లక్షల రూపాయిలను జయ భరద్వాజ్ అక్టోబర్ 7, 2022న సదరు వ్యక్తలకు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపినట్లు దీపక్ చహర్ తండ్రి తెలిపారు. (PC : Jaya Bharadwaj/Instagram)