ఇంగ్లాండ్ పర్యటలో భారత జట్టు లార్డ్స్‌లో సాధించిన విజయం తాలూక ఉత్సాహం లీడ్స్ టెస్టు తొలి సెషన్లోనే ఎగిరిపోయింది. భారత జట్టు తొలి సెషన్లో 4 వికెట్లు కోల్పోగా.. రెండో సెషన్లో కేవలం 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చాపచుట్టేసింది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు 3వ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 1952 తర్వాత ఇంగ్లాండులో భారత జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 1952లో భారత జట్టు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారత జట్టు అక్కడ చేసిన అత్యల్ప స్కోరు (78) ఇదే కావడం గమనార్హం. (PC: England Cricket/Twitter)