TEAM INDIA CATERING REQUIREMENTS ONLY HALAL MEAT NO BEEF AND PORK BCCI ISSUED NOTE JNK
Team India Food: టీమ్ ఇండియా ఆటగాళ్ల ఫుడ్ మెనూలో వాటిపై నిషేధం.. మాంసాహారం విషయంలో ఆ నియమం పాటించాల్సిందే..!
Team India Food: టీమ్ ఇండియా ఆటగాళ్ల ఫుట్ మెనూపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. కాన్పూర్లోని హోటల్ సిబ్బందికి ఆటగాళ్లకు తయారు చేసే పదార్దాలలో బీఫ్, పోర్క్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఇండియా - న్యూజీలాడ్ జట్ల మధ్య గురువారం (నవంబర్ 25) నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్నది. కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు కాన్పూర్ చేరుకున్నాయి. (PC: BCCI)
2/ 8
తొలి టెస్టు మ్యాచ్కు అజింక్య రహానే కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమ్ ఇండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2021-23లో భాగంగా రెండు మ్యాచ్ల సిరీస్ జరుగనున్నది. (PC: BCCI)
3/ 8
టీమ్ ఇండియాతో పాటు న్యూజీలాండ్ ఆటగాళ్ల కోసం కాన్పూర్లోని ల్యాండ్ మార్క్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. బయోబబుల్ వాతావరణంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఉంటున్నారు. వీరితో పాటు మ్యాచ్ అఫీషియల్స్ కూడా అదే హోటల్లో బస చేస్తున్నారు. (PC: BCCI)
4/ 8
కాగా, టీమ్ ఇండియా ఆటగాళ్ల కోసం వడ్డించే వంటలపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. నిబంధనల ప్రకారమే హోటల్లో వంటలు తయారు చేయాలని కోరుతూ ఒక ఇంటర్నల్ మెజేజ్ను హోటల్ సిబ్బందికి అందించింది. (PC: BCCI)
5/ 8
టీమ్ ఇండియా ఆటగాళ్లకు బీఫ్, పోర్క్ వడ్డించ వద్దని బీసీసీఐ ఆదేశించింది. బీఫ్, పోర్క్ ఏ రూపంలో ఉన్నా.. దాన్ని ఆటగాళ్ల మెనూలో చేర్చవద్దని స్పష్టం చేసింది. (PC: twitter)
6/ 8
ఆటగాళ్లకు వడ్డించే మటన్, చికెన్ తప్పకుండా హలాల్ చేసి ఉండాలని కూడా బీసీసీఐ చెప్పింది. ఈ రెండు నియమాలను తప్పకుండా పాటించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. (PC: twitter)
7/ 8
ఆటగాళ్లు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ హోటల్లోనే చేస్తారు. ఇక మధ్యాహ్నం భోజనం, టీ, స్నాక్స్ వారికి గ్రీన్ పార్క్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా హోటల్ నుంచే వంటకాలు వెళ్లనున్నాయి. (PC: BCCI)
8/ 8
విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన దగ్గర నుంచి హై లెవెల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతీ భారత క్రికెటర్ యోయో టెస్టు పాస్ కావాల్సి ఉంటుంది. మరి ఇలా బీఫ్,పోర్క్ నిషేధిస్తే వారికి ఫిట్నెస్ ఎలా వస్తుందని పలువురు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. (PC: Twitter)