సాధారణంగా టీమ్ కు సంబంధించి ఏ కీలక నిర్ణయమైనా టీమిండియా కెప్టెన్ ను సంప్రదించాల్సి ఉంటుంది. చాలా వరకు తుది నిర్ణయం టీమిండియా కెప్టెన్ దే అవుతోంది. జట్టు ఎంపికలో గానీ, మేనేజ్ మెంట్ విషయంలో గానీ, కోచింగ్ స్టాఫ్ ఇలా ఏ మ్యాటర్ అయినా సరే టీమిండియా కెప్టెన్ దే అంతిమ నిర్ణయం. కానీ, విరాట్ కోహ్లీ దూకుడు తగ్గించడానికి బీసీసీఐ ప్రయత్నాలు మొదలయ్యాయ్ అనడానికి లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టుగా విరాట్ కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. అయితే వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. కారణం.. ప్రస్తుత వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్థాన్, న్యూజిలాండ్ లపై వరుసగా ఓడి దాదాపు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది.
రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్ పదవికి వారం రోజుల క్రితమే అధికారికంగా దరఖాస్తు సమర్పించాడు. అక్టోబర్ 26న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి, ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. రవిశాస్త్రి టీమిండియాకు అందించిన సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. అయితే, రవిశాస్త్రి హయాంలో టీమిండియా టెస్ట్ నంబర్ జట్టుగా, డబ్ల్యూటిసీ ఫైనలిస్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.