Shreyas Iyer : నిజం చెబుతున్నా.. అయ్యర్ తోటి అట్లుంటది మరీ.. ఏదీ చేసినా మనోడీ స్టైలే వేరులే..
Shreyas Iyer : నిజం చెబుతున్నా.. అయ్యర్ తోటి అట్లుంటది మరీ.. ఏదీ చేసినా మనోడీ స్టైలే వేరులే..
Shreyas Iyer : ఇక గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు ఆడిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు సొంతం చేసుకుంది. అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) రూపంలో రెండు కొత్త జట్లు బరిలోకి దిగడంతో ఈసారి ఐపీఎల్ మరింత రసవత్తరంగా సాగింది.
2/ 7
ఇక ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా (Hardik Pnadya) సారథ్యంలోని గుజరాత్ ఏకంగా చాంపియన్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ గా హార్దిక్ ఈ సీజన్ లో అద్భుతమనే చెప్పాలి.
3/ 7
ఇక గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు ఆడిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు సొంతం చేసుకుంది. అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది.
4/ 7
అయితే ఈ సీజన్ లో శ్రేయస్ కెప్టెన్ గా పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే బ్యాటర్ గా కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. గతేడాది రన్నరప్ గా నిలిచిన కేకేఆర్ ఈ ఏడాది మాత్రం ఏడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
5/ 7
సీజన్ ముగియడంతో శ్రేయస్ అయ్యర్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. జూన్ 9న దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ముందు దొరికిన విరామంలో తనకు నచ్చిన పనులు చూస్తూ చిల్ అవుతున్నాడు.
6/ 7
[caption id="attachment_1321288" align="alignnone" width="1080"] ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ కొత్త కారును కొన్నాడు. అలాంటి ఇలాంటి కారు కాదు లగ్జరీ కార్లను తయారు చేసే మెర్సిడెస్ ఎస్యూవీని సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ ఏఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు.
[/caption]
7/ 7
అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను మెర్సిడెస్ కంపెనీ ట్వీట్టర్ లో షేర్ చేసింది.