అయితే 2024 T20 ప్రపంచ కప్‌పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ టోర్నీకి దాదాపు అన్ని దేశాలు తమ జట్లలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సీనియర్ ఆటగాళ్లను తప్పించి యువకులకు చోటిచ్చే అవకాశం ఉందని తెలిపారు. భారత జట్టులో కూడా చాలా మంది సీనియర్లు ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ టీ20లు ఆడకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ భారత ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
* దినేష్ కార్తీక్(Dinesh Karthik) : దినేష్ కార్తీక్ అనూహ్యంగా టీ20 ఇండియన్ టీంలో చోటు సంపాదించాడు. దాదాపు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడనుకొన్న సమయంలో అద్భుతమైన ప్రదర్శనలతో టీం ఇండియా తలుపు తట్టాడు. ఇప్పుడు DK వయస్సు 37 సంవత్సరాలు. ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత అతని పేరును మేనేజ్మెంట్ పరిశీలించే అవకాశాలు తక్కువ. 2024 టీ20 వరల్డ్‌కప్‌కు టీం ఇండియాను సిద్ధం చేసే క్రమంలో ఈ సీనియర్ ప్లేయర్‌ను పక్కన పెట్టవచ్చు.
2023 ప్రపంచ కప్‌పై మరింత దృష్టి పెట్టాలని భావిస్తాడు. దీంతో ODIలకు దూరంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి కోహ్లీ T20I క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కోహ్లీ కచ్చితంగా ప్రపంచ బెస్ట్ టీ20 ప్లేయర్లలో ఒకడిగా ఉంటాడు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా మిడిల్ ఓవర్లలో స్పిన్ ఆడగల అతని సామర్థ్యంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
* రోహిత్ శర్మ(Rohit Sharma) ఛ ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లు ఆడకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో టీం ఇండియాకు సారథ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్ ఇంటర్నేషనల్ టీ20లకు దూరమవుతాడని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించవచ్చు. అయితే అన్ని కోణాలను పరిశీలిస్తే అలా అనిపించకపోవచ్చు. రోహిత్ ఇటీవలి కాలంలో చాలా గాయాలతో బాధపడ్డాడు.
అతని ఫిట్నెస్ చాలా సందర్భాలలో నిరాశపరిచింది. ముఖ్యంగా T20I క్రికెట్లో అతని ప్రదర్శన ప్రతిభకు తగ్గస్థాయిలో లేదు. ఈ టీ20 వరల్డ్‌కప్ తర్వాత 2023 ODI ప్రపంచ కప్, టెస్ట్ ఫార్మాట్‌పై 35 ఏళ్ల రోహిత్ దృష్టి సారించే అవకాశం ఉంది. అదే విధంగా 2024 టీ20 వరల్డ్‌కప్ జట్టులో 35 ఏళ్లు నిండిన, గాయాలతో తరచూ బాధపడుతున్న స్కిప్పర్ ఉండాలని మేనేజ్మెంట్ కోరుకుంటుందా? అనేది ఆలోచించాలి. రోహిత్ తర్వాత టీ20 జట్టు పగ్గాలు అందుకొనే జాబితాలో హార్దిక్ పాండ్యా ముందు ఉన్నాడు. రోహిత్ స్థానంలో ఓపెనింగ్ చేయడానికి యంగ్ ప్లేయర్లకు కూడా కొదవలేదు.
* రవిచంద్రన్ అశ్విన్ : ఒకప్పుడు టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఐపీఎల్ వంటి పరిమిత ఓవర్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. గత 10 టీ20Iలలో అశ్విన్ ఎకానమీ రేట్ 6.10గా ఉంది. ఈ స్పిన్నర్ 2021 నుంచి కనీసం 10 వికెట్లు తీసి వావ్ అనిపించాడు.అలాంటి అద్భుతమైన ప్రదర్శన కారణంగానే ఈ 35 ఏళ్ల సీనియర్ స్పిన్నర్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశమిచ్చింది బీసీసీఐ. అయితే ఈ ప్రపంచకప్ అతడి కెరీర్లో లాస్ట్‌ది కావచ్చు. ఎందుకంటే అతని వయసు ఇప్పటికే పైబడింది. అందువల్ల వచ్చే టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత జట్టు తరఫున అతను సెలక్టయ్యే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి.
* భువనేశ్వర్ కుమార్ : సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వయసు 32 ఏళ్లే కానీ ఈ మధ్య ఎక్కువగా గేమ్‌లో ఉండలేకపోతున్నాడు. తరచుగా గాయాలపాలు అవుతూ భారత జట్టుకి దూరం అవుతున్నాడు. అతని ఫిట్నెస్ లెవెల్స్ ఏమంత బాలేదు. కాబట్టి నెక్స్ట్ T20 ప్రపంచకప్‌లలో భువీ భారత జట్టులో కనిపించకపోవచ్చు. కానీ ఫిట్నెస్ కాపాడుకుంటూ ఆటలో మెరుగ్గా రాణిస్తే.. నెహ్రా మాదిరిగా సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ సక్సెస్ కావచ్చు.