టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. కివీస్ సెట్ చేసిన టార్గెట్ ను ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. 8 వికెట్ల తేడాతో మెడిన్ ధనాధన్ టోర్నీని తమ ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. దీంతో పొట్టి కప్ లేని లోటును తీర్చుకుంది కంగారూల టీమ్. మిచెల్ మార్ష్ ( 50 బంతుల్లో 77 పరుగులు.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53 పరుగులు.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచులో కేన్ మామ కూడా కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు.ఇంతకముందు శ్రీలంక కెప్టెన్గా కుమార సంగక్కర 2009 టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి కెప్టెన్గా నిలిచాడు.