T20 World Cup 2022 : కుర్రాళ్ల ముందు ధోనికి ఘోర అవమానం.. అంత సీన్ లేదంటూ పక్కన పెట్టేశారుగా..
T20 World Cup 2022 : కుర్రాళ్ల ముందు ధోనికి ఘోర అవమానం.. అంత సీన్ లేదంటూ పక్కన పెట్టేశారుగా..
T20 World Cup 2022 : 2007 వన్డే ప్రపంచకప్ లో ఘోర పరాభవం తర్వాత.. అదే ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన ధోని అద్భుతాన్ని చేసి చూపించాడు.
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. భారత్ కు రెండు ప్రపంచకప్ లతో పాటు చాంపియన్స్ ట్రోఫీని అందించిన నాయకుడు ధోని.
2/ 8
2007 వన్డే ప్రపంచకప్ లో ఘోర పరాభవం తర్వాత.. అదే ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన ధోని అద్భుతాన్ని చేసి చూపించాడు.
3/ 8
యువకులతో కూడిన జట్టును ముందుండి నడిపించి టి20 ప్రపంచకప్ లో భారత్ ను చాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో మరోసారి భారత్ ను విశ్వ విజేతగా నిలిపాడు.
4/ 8
ఇక 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ ను విజేతగా నిలిపి మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమిండియా కెప్టెన్ గా నిలిచాడు. అయతే తాజాగా అతడికి ఘోర అవమానం జరిగింది.
5/ 8
ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ విజ్డెన్ ఇండియా ప్రకటించిన టీమిండియా ఆల్ టైమ్ టి20 ప్లేయింగ్ ఎలెవెన్ లో ధోనికి చోటు దక్కలేదు. టి20 ప్రపంచకప్ ను అందించిన ధోనికి చోటు దక్కక పోవడం విశేషం.
6/ 8
కెప్టెన్ గా, ఫినిషనర్ గా, వికెట్ కీపర్ గా ధోని త్రిముఖ ప్రతిభాశాలి. అయినప్పటికీ అతడికి చోటు దక్కక పోవడం నిజంగా ఆశ్చర్యకరమే అంటూ కొందరు క్రికెట్ లవర్స్ పేర్కొంటున్నారు. వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ ను విజ్డెన్ ఎంపిక చేయడం ఇక్కడ విశేషం.
7/ 8
అయితే ధోని సహచరుడు యువరాజ్ సింగ్ తో పాటు సురేశ్ రైనా.. దినేశ్ కార్తీక్, ఆశిష్ నెహ్రాలు ఈ ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసింది. 12వ ప్లేయర్ గా సెహ్వాగ్ ను ఎంపిక చేయడం మరో విశేషం. అయితే కెప్టెన్ ఎవరో చెప్పలేదు.