ఇండియన్ ఫుడ్‌కు బదులు సాండ్విచ్లు పెట్టారని ఆటగాళ్లు ఆరోపించారు. " ఆహారం ప్రమాణాల మేర లేదు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం సాండ్విచ్ తినలేం'' అని ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఇక టీమిండియా ఆటగాళ్లకు సరైన ఆహారం ఏర్పాటు చేయకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.