క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజా అందించడానికి మరి కొద్ది రోజుల్లో టీ20 మహాసంగ్రామం మొదలు కానుంది. ఆస్ట్రేలియా వేదికగా ధనాధన్ టోర్నీటీ20 వరల్డ్ కప్ 2022(T20 World Cup 2022)ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ముగింపు రోజున 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డుతో సత్కరిస్తారు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు సీజన్లు జరిగాయి. ప్రతి సీజన్లో ఏ ఆటగాళ్లు ఈ ప్రత్యేక అవార్డును అందుకున్నారో తెలుసుకుందాం. (Twitter)
2007లో దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచకప్ తొలి సీజన్ జరిగింది. ఈ ఏడాది ధోనీ సారథ్యంలో భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. కానీ 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి దక్కింది. అతను ఈ సీజన్లో బ్యాట్, బంతితో అద్భుతాలు చేశాడు. బౌలింగ్ లో ఏడు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో ఆరు ఇన్నింగ్స్‌లలో 15.1 సగటుతో 91 పరుగులు కూడా చేశాడు. (AFP)
టీ20 ప్రపంచకప్ రెండో సీజన్ 2009లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ ఏడాది లార్డ్స్‌లో శ్రీలంకను ఓడించి పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్ లో శ్రీలంక బ్యాటర్ దిల్షాన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన చేశాడు దిల్షాన్. ఏడు మ్యాచ్‌లలో 52.8 సగటుతో 317 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. (AP)
టీ20 ప్రపంచకప్ మూడో సీజన్ 2010లో వెస్టిండీస్‌లో జరిగింది. ఈ ఏడాది ఇంగ్లండ్ తొలిసారిగా మేజర్ టోర్నీలో విజయం సాధించింది. ఇంగ్లండ్ విజయంలో కెవిన్ పీటర్సన్ కీలక పాత్ర పోషించాడు. ఆరు మ్యాచ్‌లలో 248 పరుగులు చేశాడు మరియు టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ పీటర్సన్ అద్భుతంగా ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 47 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు అతడిని 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా ప్రకటించారు.
టీ20 ప్రపంచకప్ నాలుగో సీజన్ 2012లో శ్రీలంకలో జరిగింది. ఈ సీజన్లో వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకను ఓడించి విజయం సాధించింది. టోర్నీలో అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వాట్సన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. ఈ మెగాటోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 249 పరుగులు చేశాడు. అదే సమయంలో బౌలింగ్‌లో 11 వికెట్లు కూడా తీశాడు. (AFP)
టీ20 ప్రపంచకప్ ఐదో సీజన్ 2014లో బంగ్లాదేశ్‌లో జరిగింది. ఈ ఏడాది ఫైనల్లో భారత్.. శ్రీలంక జట్టుతో తలపడింది. ఇక్కడ కోహ్లీ రాణించినా శ్రీలంక జట్టు విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో కోహ్లీ బ్యాట్ పరుగుల సునామీ సృష్టించింది. ఆరు మ్యాచ్‌లలో 106.3 సగటుతో 319 పరుగులు చేశాడు కింగ్ కోహ్లీ. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆటతీరుతో కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది. (AP)
టీ20 ప్రపంచకప్ ఆరో సీజన్ 2016లో భారత్‌లో జరిగింది. కానీ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. టోర్నీలో, కోహ్లీ ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీల సహాయంతో 273 పరుగులు చేశాడు. (PTI)
టీ20 ప్రపంచకప్ ఏడో సీజన్ 2021లో యూఏఈలో జరిగింది. ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన డేవిడ్ వార్నర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది. వార్నర్ ఏడు మ్యాచ్‌లలో 48.16 సగటుతో మొత్తం 289 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు వచ్చాయి. ఈ టోర్నీలో వార్నర్ అత్యుత్తమ స్కోరు 89 పరుగులు నాటౌట్. (AFP)