Virat Kohli : ఒక్కడే.. కోహ్లీ ఒక్కడే.. కింగ్ ముందు యంగ్ ప్లేయర్స్ కూడా బలాదూర్
Virat Kohli : ఒక్కడే.. కోహ్లీ ఒక్కడే.. కింగ్ ముందు యంగ్ ప్లేయర్స్ కూడా బలాదూర్
Virat Kohli : అయితే 2019 తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వేగం తగ్గింది. మొన్నటి ఆసియా కప్ వరకు కూడా సెంచరీ లేకుండానే 1000 రోజులను కూడా పూర్తి చేసుకున్నాడు.
ప్రపంచకప్ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని భారత (India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) లిఖించుకున్నాడు. దూకుడుకు మారుపేరయిన కోహ్లీ పరుగులు సాధించడంలోనూ ముందే ఉన్నాడు.
2/ 8
అయితే 2019 తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి పరుగుల వేగం తగ్గింది. మొన్నటి ఆసియా కప్ వరకు కూడా సెంచరీ లేకుండానే 1000 రోజులను కూడా పూర్తి చేసుకున్నాడు.
3/ 8
అయితే ఒక విషయంలో మాత్రం మిగిలిన ప్లేయర్స్ ను కోహ్లీ ఓడించాడు. అదే ఫిట్ నెస్. ఫామ్ విషయంలో గడ్డు కాలాన్ని ఫేస్ చేసిన కోహ్లీ ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఏనాడు ఇబ్బంది పడలేదు.
4/ 8
బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును 27 మంది ప్లేయర్లు కలిగి ఉన్నారు. వీరిలో కోహ్లీ మినహా మిగిలిన 26 మంది ప్లేయర్లు కూడా ఏదో ఒక సమయంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో గాయాలకు చికిత్స తీసుకున్నారని బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ తన నివేదికలో వెల్లడించాడు.
5/ 8
వీరంతా కూడా 2021-2022 మధ్య కాలంలో తమ గాయాలకు చికిత్స తీసుకున్నారు. అయితే ఈ లిస్టులో మాత్రం కోహ్లీ లేడు. దీనిని బట్టే ఫిట్ నెస్ విషయంలో కోహ్లీ ఎంత జాగ్రత్తగా ఉంటాడో అర్థం అవుతుంది.
6/ 8
చికిత్స తీసుకున్న ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ, సంజూ సామ్సన్ లతో పాటు అండర్ 19 ప్లేయర్లు కూడా ఉండటం విశేషం. అయితే వీరిలో చాలా మందికి బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు లేదు.
7/ 8
కోహ్లీ 2018లో వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో ఇంగ్లండ్ లో కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్నా గాయంతో తప్పుకున్నాడు. అప్పటి నుంచి కోహ్లీ తన ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నాడు.
8/ 8
ప్రస్తుతం ఉన్న టీమిండియాలో పిచ్ లో అత్యంత చురుకైన ప్లేయర్ కూడా కోహ్లీనే. 33 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో కోహ్లీ పోటీ పడుతూ వికెట్ల మధ్య పరుగెత్తుతున్నాడు.