T20 World CUP 2022 : యే బిడ్డా ఇది నా అడ్డా.. సిడ్నీ గ్రౌండ్ లో ఈ భారత ఆటగాడి రికార్డులు చూస్తే మైండ్ బ్లాకే!
T20 World CUP 2022 : యే బిడ్డా ఇది నా అడ్డా.. సిడ్నీ గ్రౌండ్ లో ఈ భారత ఆటగాడి రికార్డులు చూస్తే మైండ్ బ్లాకే!
T20 World CUP 2022 : సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య సూపర్ 12 రౌండ్ మ్యాచ్ జరగనుంది. సిడ్నీ గ్రౌండ్ లో టీమిండియా రికార్డులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మైదానాన్ని టీమిండియా లక్కీ గ్రౌండ్ గా భావించవచ్చు.
టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఓడించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది.మెల్బోర్న్లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా సిడ్నీలోకి అడుగుపెట్టింది.
2/ 9
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య సూపర్ 12 రౌండ్ మ్యాచ్ జరగనుంది. సిడ్నీ గ్రౌండ్ లో టీమిండియా రికార్డులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ మైదానాన్ని టీమిండియా లక్కీ గ్రౌండ్ గా భావించవచ్చు.
3/ 9
ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ను అడ్డాగా చెప్పవచ్చు. ఇక్కడ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లీ మంచి ప్రదర్శన చేశాడు.
4/ 9
ఈ మైదానంలో విరాట్ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌ల్లో 79 సగటుతో 236 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. 85 పరుగులు SCGలో విరాట్ అత్యుత్తమ స్కోరు. ఇక్కడ కోహ్లీ స్ట్రైక్ రేట్ 146. ఈ గణంకాలు చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ కోహ్లీ ఎలా చెలరేగుతాడో.
5/ 9
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇక్కడ 2 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు మ్యాచుల్లో 75 పరుగులు చేశాడు. పాక్ మ్యాచులో విఫలమైన రోహిత్ కు నెదర్లాండ్స్ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ ద్వారా తిరిగి ఫామ్ అందుకోవాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు.
6/ 9
ఇక, సిడ్నీ గ్రౌండ్ లో టీమిండియా రికార్డులు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో టీమిండియా 3 గెలిచింది. ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆస్ట్రేలియాతోనే తలపడింది భారత్.
7/ 9
సిడ్నీ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇది భారత బౌలర్లలో అత్యుత్తమ ప్రదర్శన.
8/ 9
టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా నెదర్లాండ్స్, భారత్ జట్లు తలపడనున్నాయి. గతంలో ఇరు జట్ల మధ్య 2 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. రెండు సార్లు భారత్ గెలిచింది. ఇక, ఈ మ్యాచులో గెలిచి నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
9/ 9
సూపర్ 12 రౌండ్లో నెదర్లాండ్స్‌తో పాటు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే పాక్ ను ఓడించిన టీమిండియా.. మిగతా మ్యాచుల్లో కూడా గెలిచి సెమీస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది.