అయితే, కొంత విరామం తర్వాత రోహిత్ శర్మ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో.. ఇండియన్ కోచింగ్ స్టాఫ్, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. గాయంతో ఆడితే.. అసలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలా రెండు రోజుల్లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు గాయాల బారి నుంచి తప్పించుకోవడం గుడ్ న్యూస్.