పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్స్ ఈ ప్రపంచకప్ కే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇక, ఆస్ట్రేలియా గడ్డపై జగజ్జేతగా నిలిచింది ఇంగ్లండ్. మెల్బోర్న్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది ఇంగ్లండ్. 138 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. దీంకో 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.