T20 World Cup 2022 : అప్పుడు ఆర్పీ సింగ్, జహీర్ ఖాన్.. ఇప్పుడు అర్ష్‌దీప్.. ఈ లెక్కన టీమిండియానే ఛాంపియన్!
T20 World Cup 2022 : అప్పుడు ఆర్పీ సింగ్, జహీర్ ఖాన్.. ఇప్పుడు అర్ష్‌దీప్.. ఈ లెక్కన టీమిండియానే ఛాంపియన్!
T20 World Cup 2022 : 15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అయితే, ఓ సెంటిమెంట్ ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ కు బోలెడు ఆనందాన్ని ఇస్తుంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సారి టీమిండియాకు టీ20 ప్రపంచకప్పు ఖాయమంటున్నారు.
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 కీలక ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 9, 10వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. సూపర్ 12లో లాగా సెమీస్ కథ ఉండదు. నాకౌట్ రౌండ్స్ కాబట్టి ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే. (PC : TWITTER)
2/ 9
సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ (NZ vs PAK).. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ (IND vs ENG) తలపడనుంది. దీంతో ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (PC : TWITTER)
3/ 9
ఇక, 15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అయితే, ఓ సెంటిమెంట్ ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ కు బోలెడు ఆనందాన్ని ఇస్తుంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సారి టీమిండియాకు టీ20 ప్రపంచకప్పు ఖాయమంటున్నారు.(PC : TWITTER)
4/ 9
ఆ సెంటిమెంట్ ఏంటంటే.. అర్ష్‌దీప్ సింగ్. అవును మీరు విన్నది కరెక్టే. టీ20 ప్రపంచకప్ టీమిండియా కైవసం అవ్వడానికి, అర్ష్ దీప్ కు లింకు ఉంది. ఆ లింకు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
5/ 9
అర్ష్‌దీప్ సింగ్... ఐపీఎల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి టీమిండియాలోకి వచ్చిన భారత బౌలర్. ఇక, టీ20 వరల్డ్ కప్‌కి ముందు జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అతను లేని లోటును ఎవరు తీరుస్తారని ఆతృతగా ఎదురుచూశారు టీమిండియా అభిమానులు.
6/ 9
ఆ లోటు తీర్చే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, టీ20 వరల్డ్ కప్ 2022లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ మెగాటోర్నీలో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ సంచలనం.
7/ 9
అయితే, టీ20 ప్రపంచకప్ 2007లో లెఫ్టార్మ్ పేసర్ ఆర్పీసింగ్ 12 వికెట్లు తీసి.. టాపర్ గా నిలిచాడు. ఆ మెగాటోర్నీ టీమిండియా సొంతమైన సంగతి తెలిసిందే. ఆ పొట్టి ప్రపంచకప్ విజయంలో ఆర్పీసింగ్ కీ రోల్ ప్లే చేశాడు.
8/ 9
ఇక, 2011 వన్డే వరల్డ్ కప్ లో మరో లెఫ్టార్మ్ పేసర్ జహీరే ఖాన్ 21 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. జహీర్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ లో ఆ వరల్డ్ కప్ కూడా మన టీమిండియా సొంతమైంది.
9/ 9
ఇప్పుడు కూడా అర్ష్ దీప్ రూంలో మరో లెఫ్టార్మ్ పేసర్ టీ20 ప్రపంచకప్ లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే 10 వికెట్లతో టీమిండియా టాప్ బౌలర్ గా నిలిచాడు. దీంతో ఆర్పీ సింగ్, జహీర్ ఖాన్ లతో పోలుస్తూ ఈ సారి టీ20 ప్రపంచకప్ 2022 టీమిండియాదే అని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.