దాంతో భారత విజయ సమీకరణం 3 బంతులకు 13 పరుగులుగా మారుతుంది. ఈ దశలో నవాజ్ వేసిన ఫుల్ టాస్ ను కోహ్లీ సిక్సర్ బాదుతాడు. ఫుల్ టాస్ నడుం కంటే ఎక్కువ ఎత్తులో ఉండటంతో అంపైర్లు నో బాల్ గా ప్రకటిస్తారు. ఫ్రీ హిట్ కు భారత్ మూడు పరుగులు సాధిస్తుంది. అనంతరం కార్తీక్ వికెట్ ను కోల్పోయినా అశ్విన్ విన్నింగ్ షాట్ తో జట్టును గెలిపిస్తాడు.