ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తి చూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022) మహాసమరం మొదలైంది. క్వాలిఫైయర్ మ్యాచులు, వార్మప్ మ్యాచులతో క్రికెట్ పండుగ షూరు అయింది. ఇక, ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్, టీమిండియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగాయి.
టీమిండియా : రోహిత్ సేన ఈ లిస్ట్ లో టాప్ ప్లేసులో ఉంది. ఆసీస్ గడ్డపై 20 మ్యాచులాడిన టీమిండియా 12 మ్యాచుల్లో విజయకేతనం ఎగురవేసింది. మరో మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆసీస్ గడ్డపై టీమిండియా విజయాల శాతం 60 గా ఉంది. దీంతో, ఈ మెగాటోర్నీలో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. అయితే, 2007 ప్రపంచకప్ తప్ప టీమిండియాకు మరే మెగాటోర్నీ గెలవలేకపోయింది.
పాకిస్తాన్ : దాయాది జట్టు పాకిస్తాన్ కూడా ఆసీస్ గడ్డపై మంచి రికార్డుంది. కంగారూల గడ్డపై పాక్ .. 24 మ్యాచులాడగా.. 10 సార్లు ఓడి.. 12 సార్లు గెలిచింది. ఆ జట్టు విజయ శాతం 50గా ఉంది. అయితే, ఈ సారి పాక్ జట్టు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. పాక్ బౌలర్లకు ఆస్ట్రేలియా పిచ్ లు ఎక్కువగా సహకరించే అవకాశం ఉంది. బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్ లు ఫామ్ లో ఉండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ గా మారనుంది.