కానీ, కోహ్లీ అలా చేయలేదు. మూడో పరుగు తీసి జట్టు విజయ సమీకరణాన్ని 2 బంతులకు రెండు పరుగులుగా మారుస్తాడు. ఇదే కాదు ఇటీవలె సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో కూడా కోహ్లీకి అర్ధ సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. ఆఖరి ఓవర్లో కార్తీక్ నే ఆడమని చెబుతాడు. ఆ మ్యాచ్ లో కార్తీక్ ఆఖరి ఆరు బంతులకు 16 పరుగులు సాధిస్తాడు.