T20 World Cup 2022 : టీమిండియాలో చోకర్స్.. వీరిని నమ్ముకుంటే కుక్క తోక పట్టి గోదారి ఈదినట్లే
T20 World Cup 2022 : టీమిండియాలో చోకర్స్.. వీరిని నమ్ముకుంటే కుక్క తోక పట్టి గోదారి ఈదినట్లే
T20 World Cup 2022 : ఇక అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 దశ ఆరంభం కానుంది. 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించాలని.. ఈసారి ఎలాగైనా టి20 ప్రపంచకప్ ను ముద్దాడాలనే పట్టుదలతో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.
టి20 ప్రపంచకప్ (T20 World cup) మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు గ్రూప్ దశ జరగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. రెండు గ్రూపులుగా వీటిని విభజించారు. ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 12కు చేరుకుంటాయి.
2/ 8
ఇక అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 దశ ఆరంభం కానుంది. 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించాలని.. ఈసారి ఎలాగైనా టి20 ప్రపంచకప్ ను ముద్దాడాలనే పట్టుదలతో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.
3/ 8
అయితే భారత్ ను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా పేస్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తుంది. రెగ్యులర్ గా టి20 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లుగా భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్ లు మాత్రమే ఉన్నారు.
4/ 8
గాయం నుంచి కోలుకున్న హర్షల్ పటేల్ తో పాటు మొహమ్మద్ షమీలు పెద్దగా టి20 మ్యాచ్ లు ఆడలేదు. దాంతో ఆస్ట్రేలియా లాంటి పేస్ కు అనుకూలంగా ఉండే పిచ్ లపై భారత పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపగలరో చూడాలి.
5/ 8
వీటితో పాటు భారత్ కీలక మ్యాచ్ ల్లో తడబడుతుంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్స్ నాకౌట్ పోరుల్లో చేతులెత్తేస్తున్నారు. ఇది 2015 వన్డే ప్రపంచకప్ నుంచి కొనసాగుతూ వస్తోంది.
6/ 8
ముఖ్యంగా సెమీఫైనల్ లాంటి పోరుల్లో కోహ్లీ విఫలం అవుతున్నాడు. అతడితో పాటు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు కూడా నాకౌట్ మ్యాచ్ ల్లో ఆశించిన స్థాయిలో ఆడటం లేదు.
7/ 8
సెమీస్ వరకు చేరడంలో భారత్ కు ఏ డోకా కనిపించడం లేదు. అయితే నాకౌట్ దశలోనే భారత్ తడబడే అలవాటును అధిగమించాలని ప్రతి ఒక్క టీమిండియా అభిమాని ఆశిస్తున్నాడు.
8/ 8
భారత్ తన తొలి పోరును అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థితో ఆడుతుంది. భారత్ ఉన్న గ్రూప్ లోనే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. వెస్టిండీస్, నెదర్లాండ్స్ జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది.