ఇక పక్కటెముకల గాయం బారిన పడి ఆసియా కప్ కు దూరమైన హర్షల్ పటేల్ ఫిట్ నెస్ పై కూడా సందేహాలు ఉన్నాయి. అతడు టి20 ప్రపంచకప్ కు డౌటై అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే కోలుకున్న అతడు ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో టి20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చాయి. అయితే పునరాగమనంలో అతడు అంత కంఫర్ట్ గా ఏ మ్యాచ్ లోనూ కనిపించలేదు. ఫిట్ నెస్ తో లేని ప్లేయర్లతో భారత్ ప్రపంచకప్ లో ఆడుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.