టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) కౌంట్ డౌన్ షురూ అయింది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. సొంత గడ్డపై కంగారూ టీం డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెడుతుంది. ఇక 15 ఏళ్ల తర్వాత అయినా టి20 ప్రపంచకప్ ను సొంతం చేసుకోవాలని భారత్ (India) పట్టుదలగా ఉంది.
ఈ క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ లను కూడా ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన తొలి టి20లో భారత్ విజయం సాధించింది. అయితే, గురువారం జరిగిన రెండో టి20లో మాత్రం 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు బ్యాటింగ్ కు దిగలేదు.
పంత్.. లాంగ్ ఫార్మాట్ లో అద్భుతమైన ప్లేయర్. అక్కడ ఓపికతో ఆడి.. ఆ తర్వాత హిట్టింగ్ చేసే అవకాశం ఉంది. కానీ, లిమిటెట్ క్రికెట్ లో పంత్ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇది కొట్టచ్చినట్టు కన్పిస్తుంది. ఓ రెండు మూడు డాట్ బాల్స్ ఆడిన వెంటనే ఒత్తిడికి లోనై.. భారీ షాట్ కు యత్నించి ఔట్ అవుతున్నాడు. దీంతో, తనతో పాటు టీమిండియాను కూడా కష్టాల్లోకి నెట్టేస్తున్నాడు.