IND vs PAK : ఎంసీజీ తన అడ్డా అంటూ తొడగొట్టాడు.. చివరికి టీమిండియా చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ పేసర్.. ఎవరంటే?
IND vs PAK : ఎంసీజీ తన అడ్డా అంటూ తొడగొట్టాడు.. చివరికి టీమిండియా చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ పేసర్.. ఎవరంటే?
IND vs PAK : అన్నట్లే ఆరంభంలోనే రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ వికెట్లను తీసి డేంజరస్ గా కనిపించాడు. ఆశలు పెట్టుకున్న షాహీన్ అఫ్రిది తేలిపోయినా మరో పేసర్ నసీం షాతో కలిసి రవూఫ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ భారత్ ను ఒత్తిడిలోకి నెట్టాడు.
‘ఎంసీజీ (MCG) నా అడ్డా.. అక్కడ ఎలా బౌలింగ్ చేయాలో నాకు బాగా తెలుసు. భారత (India) బ్యాటర్లకు చుక్కలు చూపిస్తా’ రెండు వారాల క్రితం పాకిస్తాన్ (Pakistan) పేసర్ హారీస్ రవూఫ్ (Haris Rauf) చేసిన వ్యాఖ్యలు ఇవి.
2/ 8
హారీస్ రవూఫ్ బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ స్టార్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దాంతో అతడు ఎంసీజీ వేదికగా అనేక లీగ్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. దాంతో భారత్ తో జరిగే మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్లకు రవూఫ్ వార్నింగ్ ఇచ్చాడు.
3/ 8
ఎంసీజీ పిచ్ గురించి తనకు అవగాహన ఉందని.. అక్కడ ఎలా బౌలింగ్ చేయాలో తనకు బాగా తెలుసని రవూఫ్ బల్ల గుద్ది మరీ చెప్పాడు. టీమిండియా బ్యాటర్లను ఒక ఆట ఆడుకుంటానని కూడా పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
4/ 8
అన్నట్లే ఆరంభంలోనే రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ వికెట్లను తీసి డేంజరస్ గా కనిపించాడు. ఆశలు పెట్టుకున్న షాహీన్ అఫ్రిది తేలిపోయినా మరో పేసర్ నసీం షాతో కలిసి రవూఫ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ భారత్ ను ఒత్తిడిలోకి నెట్టాడు.
5/ 8
అయితే రవూఫ్ ఆటలు కోహ్లీ ముందు మాత్రం సాగలేదు. కీలకమైన 19వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన రవూఫ్ తొలి నాలుగు బంతులకు కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత విజయం సమీకరణం 8 బంతులకు 28 పరుగులుగా మారిపోయింది.
6/ 8
అయితే 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మార్చిన కోహ్లీ టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. అప్పటి వరకు ఫర్వాలేదనిపించిన రవూఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు.
7/ 8
‘కుప్పిగంతులు వేరే వాళ్ల ముందు వేసుకో తన ముందు కాదం’టూ కోహ్లీ తన బ్యాట్ తో రవూఫ్ కు తెలియజేశాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో గతేడాది టి20 ప్రపంచకప్ లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.
8/ 8
సూపర్ 12లో భారత్ తన తదుపరి మ్యాచ్ లను ఈ నెల 27న నెదర్లాండ్స్ తో.. 30న సౌతాఫ్రికాతో.. నవంబర్ 2న బంగ్లాదేశ్ తో.. నవంబర్ 6న జింబాబ్వేలతో ఆడనుంది. సౌతాఫ్రికాపై విజయం సాధిస్తే భారత్ సెమీస్ చేరడం దాదాపుగా ఖాయం అవుతుంది.