Virat Kohli : కొత్త చరిత్రకు చేరువలో కింగ్ కోహ్లీ.. మరో 28 పరుగులు చేస్తే చాలు
Virat Kohli : కొత్త చరిత్రకు చేరువలో కింగ్ కోహ్లీ.. మరో 28 పరుగులు చేస్తే చాలు
Virat Kohli :పాకిస్తాన్ తో జరిగిన తొలి పోరులో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కింగ్ కోహ్లీ.. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటాడు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat KOhli) సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా రెండు అర్ధ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2/ 8
పాకిస్తాన్ తో జరిగిన తొలి పోరులో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కింగ్ కోహ్లీ.. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ సత్తా చాటాడు.
3/ 8
నెదర్లాండ్స్ తో జరిగిన పోరులో 44 బంతుల్లో 62 పరుగులు చేసి మరోసారి అజేయంగా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. వరుసగా రెండు అర్ధ సెంచరీలతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు.
4/ 8
ఇక టి20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు వరకు కోహ్లీ 845 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు.
5/ 8
అయితే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించడంతో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 23 మ్యాచ్ ల్లో 989 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
6/ 8
ప్రస్తుతం కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డుకు కేవలం 28 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. టి20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే ఉన్నాడు. జయవర్దనే 31 మ్యాచ్ ల్లో 1,016 పరుగులు చేశాడు.
7/ 8
మూడో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 33 మ్యాచ్ ల్లో 965 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు.. 7 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.
8/ 8
నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 35 మ్యాచ్ ల్లో 904 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.