T20 World Cup 2022 : వీరిని సెలెక్ట్ చేయడం టీమిండియాకు పెద్ద బొక్క.. వీరి స్థానాల్లో వేరే వాళ్లను తీసుకోవాల్సింది
T20 World Cup 2022 : వీరిని సెలెక్ట్ చేయడం టీమిండియాకు పెద్ద బొక్క.. వీరి స్థానాల్లో వేరే వాళ్లను తీసుకోవాల్సింది
T20 World Cup 2022 : ఒక వేళ ఓడిపోతే మాత్రం అప్పుడు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే జింబాబ్వేపై భారత్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు. అలా అని అజాగ్రత్త కూడా పనికి రాదు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) సెమీఫైనల్ కు చేరువైంది. ఆదివారం జింబాబ్వే (Zimbabwe)తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించినా.. లేక వర్షంతో ఆ మ్యాచ్ రద్దయినా సరే టీమిండియా సెమీఫైనల్ కు చేరుకుంటుంది.
2/ 10
ఒక వేళ ఓడిపోతే మాత్రం అప్పుడు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే జింబాబ్వేపై భారత్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు. అలా అని అజాగ్రత్త కూడా పనికి రాదు.
3/ 10
ఇక టి20 ప్రపంచకప్ లో భారత్ ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడితే అందులో మూడింటిలో నెగ్గింది. ఈ మూడు మ్యాచ్ ల్లోనూ కొందరు ప్లేయర్లు అద్భుతంగా ఆడితే మరికొందరు దారుణ ప్రదర్శన చేశారు.
4/ 10
దారుణ ప్రదర్శన చేసిన ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు వీరిని టి20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసి బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని టీమిండియా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
5/ 10
ఫినిషర్ రోల్ కోసం దినేశ్ కార్తీక్ ను టీమిండియాలోకి ఎంపిక చేశారు. ఈ టి20 ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా కార్తీక్ ఫినిషర్ లాంటి ఆటను ప్రదర్శిచంలేదు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం ముంగిట అవుటయ్యాడు.
6/ 10
ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కార్తీక్ కు చక్కటి అవకాశం వచ్చింది. అయితే ఆ మ్యాచ్ లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు.
7/ 10
ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రనౌట్ అయ్యాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన మూడు మ్యాచ్ ల్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. కనీసం అశ్విన్ లా కూడా ఆడలేకపోయాడు.
8/ 10
ఇక దీపక్ హుడాను అసలు టి20 ప్రపంచకప్ కోసం ఎందుకు ఎంపిక చేశారో అర్థం కాని పరిస్థితి. సౌతాఫ్రికాపై ఆడే అవకాశం వచ్చిన డకౌట్ అయ్యాడు. అంతకుమందు ఆసియా కప్ లో అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
9/ 10
వీరిద్దరితో పాటు అక్షర్ పటేల్ కూడా ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయాడు. రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు అటు బ్యాటర్ గా ఇటు బౌలర్ గా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో కూడా మెప్పించలేకపోయాడు.
10/ 10
వీరి స్థానాల్లో సంజూ సామ్సన్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ లాంటి ప్లేయర్లకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని టీమిండియా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.