ఈ తరుణంలోనే శ్రీలంక జట్టు…ధనుష్క గుణ తిలకను అక్కడే వదిలేసి స్వదేశానికి పయనమయింది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన జట్టులో గుణతిలక కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో క్వాలిఫై రౌండ్ ఆడిన లంక.. తాము ఆడిన తొలి మ్యాచ్ (నమీబియా) లో గుణతిలక ఆడాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. (PC : Twitter)
నవంబర్ 2న ఆ యువతిపై గుణతిలక అత్యాచారానికి పాల్పడ్డట్టు అందులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు గుణతిలకను అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు.. నేడు అతడిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ధనుష్క తిలక తరఫున 3 టెస్టులు, 47 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం గుణతిలకకు ఇదే తొలి సారి కాదు. గతంలో ఇంగ్లండ్ పర్యటనలో బహిరంగంగా సిగరెట్లు తాగుతూ.. అప్పడు జట్టు నుంచి ఒక సంవత్సరం పాటు నిషేధానికి గురయ్యాడు.