ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే. 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జింబాబ్వే 3 పాయింట్లతో గ్రూప్ ‘2’ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
క్వాలిఫైయింగ్ మ్యాచులతో కలిపి ఈ వరల్డ్ కప్ లోనే రజాకు 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వచ్చాయి. పాకిస్తాన్ లో పుట్టిన సికందర్ రజా ఇప్పుడు ఆ జట్టుకే కొరకరాని కొయ్యగా మారాడు. 2002లో పాకిస్తాన్ నుంచి తన కుటుంబంతో జింబాబ్వేకి వలసకు పోయాడు రజా. అక్కడే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ.. అక్కడి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
అయితే, పౌరసత్వ సమస్యలతో జట్టులో త్వరగా చోటు దక్కించుకోలేకపోయాడు. సికందర్ రజాకి 2011లో జింబాబ్వే పౌరసత్వాన్ని ఇచ్చింది. దీంతో, సికందర్ రజాకి జింబాబ్వే తరపున ఆడే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు ఏకంగా జింబాబ్వే జట్టులో స్టార్ ఆటగాడిగా మారాడు. బ్యాట్, బంతితో రాణిస్తూ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.