క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా ధనాధన్ టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2022 (T20 World Cup 2022)ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. కొన్ని జట్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైతే.. మరికొన్ని టీమ్స్.. ఇతర జట్లతో సిరీస్ లు ఆడుతూ కావాల్సినంత ప్రాక్టీస్ సంపాదించుకుంటున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది.
15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టి20 ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా టీమిండియా (Team India) ఉంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఈ నెల 23న జరిగే మ్యాచ్ తో భారత్ తన ప్రపంచకప్ టైటిల్ వేటను ఆరంభిస్తుంది. ఈ సూపర్ ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మెగాటోర్నీకి ముందు జస్ప్రీత్ బుమ్రా రూపంలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది.
గాయంతో.. బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎంపికయ్యాడు మన హైదరాబాదీ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్. ప్రస్తుతం మంచి టచ్ లో ఉన్న సిరాజ్ బాయ్ నే ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నారు.