పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తొలి 6 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ భారత్ పవర్ ప్లేలో తడబడింది. 6 ఓవర్లలే కేవలం 32 పరుగులు మాతమ్రే చేసి ఒక వికెట్ ను కోల్పోయింది. సౌతాఫ్రికాపై 33 పరుగులకు 3 వికెట్లు నష్టపోయింది. ఇక బంగ్లాదేశ్ పై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.
15 ఏళ్ల నిరీక్షణకు తెరదించి చాంపియన్ గా అనిపించుకోవాలంటే టీమిండియా ప్రతి విభాగంలోనూ అద్బుతంగా ఆడాల్సి ఉంటుంది. ఆఖరి బంతికి ఓడినా అది ఓటమి కిందికే వస్తుంది. టోర్నీ జరిగే కొద్ది భారత్ లాగే ఇతర జట్లు కూడా తమ సమస్యలను అధిగమించి టైటిల్ కోసం పోటీ పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న తప్పు కూడా ఓటమికి కారణం అవుతాయి.