T20 World Cup 2022 : మనసున్న మారాజు మన రోహిత్.. అభిమాని కోసం ఏకంగా అంత డబ్బును..
T20 World Cup 2022 : మనసున్న మారాజు మన రోహిత్.. అభిమాని కోసం ఏకంగా అంత డబ్బును..
T20 World Cup 2022 : సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకివ్వడం.. బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ గెలవడంతో భారత్ తో పాటు దాయాది దేశం పాక్ కూడా సెమీస్ చేరింది. జింబాబ్వేపై నెగ్గడంతో భారత్ గ్రూప్ టాపర్ గా సెమీస్ చేరింది. రన్నరప్ హోదాలో పాకిస్తాన్ నాకౌట్ కు చేరుకుంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) సెమీఫైనల్స్ కు చేరుకుంది. టి20 ప్రపంచకప్ లలో సెమీస్ కు చేరడం భారత్ కు ఇది మూడోసారి. 2007, 2014, 2016లలో భారత్ సెమీస్ చేరింది.
2/ 8
సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ షాకివ్వడం.. బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ గెలవడంతో భారత్ తో పాటు దాయాది దేశం పాక్ కూడా సెమీస్ చేరింది. జింబాబ్వేపై నెగ్గడంతో భారత్ గ్రూప్ టాపర్ గా సెమీస్ చేరింది. రన్నరప్ హోదాలో పాకిస్తాన్ నాకౌట్ కు చేరుకుంది.
3/ 8
ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భారత్ చెలరేగిపోయింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దాంతో భారత్ 71 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను ఖంగుతినిపించింది.
4/ 8
అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆస్తికర సంఘటన చోటు చేసుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్ లో ఒక అభిమాని రోహిత్ కోసం మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ రోహిత్ ను హగ్ చేసుకునేందుకు అతడు సెక్యూరిటీ కళ్లుగప్పి గ్రౌండ్ లోకి వచ్చాడు.
5/ 8
ఈ క్రమంలో ఆ అభిమానికి గ్రౌండ్ నిర్వాహకులు రూ. 6.50 లక్షలను జరిమానాగా విధించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రోహిత్ శర్మ ఆ ఫైన్ ను తన సొంత డబ్బుతో చెల్లించినట్లు సమాచారం.
6/ 8
దాంతో అతడి అభిమానులు రోహిత్ మనసున్న మారాజు అంటూ కామెంట్స్ చేస్తూ సంబరపడిపోతున్నారు. అభిమాన క్రికెటర్లతో కరచాలనం చేయడం కోసం కొందరు అభిమానులు మ్యాచ్ జరగుతున్న సమయంలో గ్రౌండ్స్ లోకి రావడం తరుచూ చూస్తూనే ఉంటాం.
7/ 8
ఇక ఈ టి20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ బ్యాట్ తో తన స్థాయి ఆటను ఇప్పటి వరకు ప్రదర్శించలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో నెదర్లాండ్స్ పై మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. ఇక మిగిలిన మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శన చేశాడు.
8/ 8
అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో భారత్ తాడో పేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 10న (గురువారం) జరగనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం గం. 1.30లకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.