T20 World Cup 2022 : 2 పరుగులే తేడా.. సింహాసనం కోసం కోహ్లీ, రోహిత్ ల మధ్య క్రేజీ ఫైట్
T20 World Cup 2022 : 2 పరుగులే తేడా.. సింహాసనం కోసం కోహ్లీ, రోహిత్ ల మధ్య క్రేజీ ఫైట్
T20 World Cup 2022 : ప్రపంచకప్ క్రికెట్ లో టాప్ ప్లేయర్ల జాబితాలో ఉన్న భారత క్రికెటర్లు రోహిత్, కోహ్లీలను ఒక రికార్డు ఊరిస్తోంది. వీరిద్దరి మధ్య కేవలం 2 పరుగుల తేడా మాత్రమే ఉండటంతో ఈ ప్రపంచకప్ లో వీరి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో గర్జించేందుకు టీమిండియా (Team India) ప్లేయర్స్ సిద్ధమయ్యారు. ఈ నెల 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది.
2/ 8
ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు.. నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తుంది. ఇక టి20 ప్రపంచకప్ లో భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కీలకం కానున్నారు.
3/ 8
అయితే వీరిద్దరి మధ్య ఒక రికార్డు దోబూచులాడుతుంది. ఈ రికార్డు రేసులో వీరిద్దరి మధ్య ఉన్న తేడా కేవలం రెండు పరుగులే కావడం విశేషం. టి20 ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచేందుకు వీరిద్దరూ ఫైట్ చేస్తున్నారు.
4/ 8
ఈ జాబితాలో ప్రస్తుతానికి అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముందున్నాడు. టి20 ప్రపంచకప్ లలో ఇప్పటి వరకు 33 మ్యాచ్ లు ఆడిన అతడు 847 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికం 79 నాటౌట్.
5/ 8
రెండు పరుగుల తేడాతో టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 21 మ్యాచ్ ల్లో 845 పరుగులు చేశాడు. 10 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అత్యధికం 89 నాటౌట్.
6/ 8
టి20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మాత్రం రోహిత్ శర్మ నాలుగు.. కోహ్లీ ఐదో స్థానాల్లో ఉన్నారు. ఇందులో శ్రీలంక వెటరన్ బ్యాటర్ మహేళా జయవర్ధనే అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 31 మ్యాచ్ ల్లో 1,016 పరుగులు చేశాడు.
7/ 8
రెండో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. 33 ప్రపంచకప్ మ్యాచ్ ల్లో గేల్ 965 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు 7 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అత్యధిక స్కోరు 117.
8/ 8
ఇక మూడో స్థానంలో శ్రీలంకకు చెందిన మరో వెటరన్ ప్లేయర్ తిలకరత్నే దిల్షాన్ ఉన్నాడు. 35 మ్యాచ్ ల్లో 897 పరుగులు చేశాడు. ఆరు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 96 నాటౌట్.