జడేజా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్.. ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ తో తనను తాను నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతడి బంతులను ఎదుర్కోవడం రైట్ హ్యాండర్స్ కు సవాల్ గా మారనుంది. టర్న్, వితౌట్ టర్న్ తో బౌలింగ్ చేయడంలో అక్షర్ దిట్ట. అంతేకాకుండా పవర్ ప్లే తో పాటు డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేయడం అక్షర్ లోని మరో ప్రత్యేకత.