బౌలింగ్ : బుమ్రా గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత బౌలింగ్ పేలవంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో భారత్ తేలిపోతూ వస్తుంది. బుమ్రా స్థానంలో షమీ జట్టులోకి వచ్చేది ఖాయం. ఇక స్పిన్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ తో పాటు అశ్విన్ కీలకం కానున్నాడు. చహల్ రాణించాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన సమస్య బౌలింగ్. సరి చేసుకోకుంటే 200కు పైగా పరుగులు చేసినా ఓడిపోయే ప్రమాదం ఉంది.
ఫేవరెట్ ట్యాగ్ : ఈ టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. గత కొన్నేళ్లుగా ప్రతి ఐసీసీ టోర్నమెంట్ ల్లోనూ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం కీలక మ్యాచ్ ల్లో ఓడి ఇంటి దారి పట్టడం అలవాటుగా మారింది. మొన్నటికి మొన్ని జరిగిన ఆసియా కప్ లో కూడా భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి ఫైనల్ కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో టీమిండియా ఫేవరెట్ ట్యాగ్ ను ఎలా డీల్ చేస్తుందో చూడాలి.