T20 World Cup 2022 : అన్నీ ఉన్నా ఆ జట్టు నోట్లో శని.. అదృష్టం లేక మెగా టోర్నీల్లో విఫలం.. ఈసారి ఏం చేస్తుందో?
T20 World Cup 2022 : అన్నీ ఉన్నా ఆ జట్టు నోట్లో శని.. అదృష్టం లేక మెగా టోర్నీల్లో విఫలం.. ఈసారి ఏం చేస్తుందో?
T20 World Cup 2022 : ఇక తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తు చిత్తుగా ఓడించడంలో దక్షిణాఫ్రికా ముందుంటుంది. అయితే ప్రపంచకప్ ల్లో మాత్రం దక్షిణాఫ్రికాను దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
క్రికెట్ లో దక్షిణాఫ్రికా (South Africa) క్రికెట్ టీం టఫ్ టీంగా పేర్కొంటారు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లతో పాటు టాప్ క్లాస్ ఫీల్డర్లు ఆ జట్టు సొంతం. వన్డేల్లో అత్యధిక పరుగుల ఛేజ్ రికార్డును ఇప్పటికీ దక్షిణాఫ్రికా పేరిటే ఉంది.
2/ 8
ఇక తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తు చిత్తుగా ఓడించడంలో దక్షిణాఫ్రికా ముందుంటుంది. అయితే ప్రపంచకప్ ల్లో మాత్రం దక్షిణాఫ్రికాను దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
3/ 8
గ్రూప్ దశలో అద్భుతంగా ఆడినా.. నాకౌట్ ఫేజ్ లో మాత్రం ఓడిపోతూ వస్తుంది. ఎప్పటి నుంచో క్రికెట్ అడుతున్నా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ (టి20, వన్డే కలిపి)ల్లో ఫైనల్ కు చేరలేదు.
4/ 8
సెమీస్ చేరడం.. అక్కడ ఎదో ఒక దరుదృష్టం వెంటాడటం ఇంటి దారి పట్టడం ప్రపంచకప్ లలో సఫారీ జట్టు వరుస ఇది. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో సూపర్ 12లో ఆస్ట్రేలియాతో సమానంగా పాయింట్లు సంపాదించినా.. నెట్ రన్ రేట్ కారణంతో నాకౌట్ దశకు చేరలేకపోయింది.
5/ 8
ఇక టి20 ప్రపంచకప్ ఆరంభం కావడంతో ఈసారైనా దక్షిణాఫ్రికాకు లక్ కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే సూపర్ 12కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా గ్రూప్ 2లో ఉంది.
6/ 8
ఇందులో భారత్ తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. మరో రెండు జట్లు చేరాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ జట్లు కూడా ఉండటంతో సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికాకు అంత సులభం కాదు.
7/ 8
దక్షిణాఫ్రికా తన తొలి పోరును ఈ నెల 24న గ్రూప్ దశలో క్వాలిఫై అయిన జట్టుతో ఆడనుంది. ఇక సౌతాఫ్రికా జట్టును చూస్తే బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మిల్లర్, క్లాసెన్, మార్కరమ్, డి కాక్ మంచి ఫామ్ లో ఉన్నారు.
8/ 8
ఇక బౌలింగ్ కూడా బలంగానే ఉంది. అయితే కెప్టెన్ బవుమా ఫామ్ ఆ జట్టును కలవర పెడుతుంది. సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా ప్రతి మ్యాచ్ ను కూడా గెలవాల్సి ఉంటుంది.