T20 World Cup 2022 : ఫ్లైట్ మిస్ అయ్యాడు.. ప్రపంచకప్ నుంచి అవుటయ్యాడు.. వీండీస్ వీరుడి ధీన గాథ
T20 World Cup 2022 : ఫ్లైట్ మిస్ అయ్యాడు.. ప్రపంచకప్ నుంచి అవుటయ్యాడు.. వీండీస్ వీరుడి ధీన గాథ
T20 World Cup 2022 : అయితే ఈ టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ (West Indies) జట్టులో గందరగోళం నెలకొంది. తమ ప్లేయర్ వ్యవహార శైలిపై ఆగ్రహానికి గురైన వెస్టిండీస్ జట్టు అతడిని ఏకంగా టి20 ప్రపంచకప్ నుంచి వేటు వేసింది.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభం కావడానికి రెండు వారాల కంటే తక్కువ సమయమే ఉంది. ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ నెల 16 నుంచి నవంబర్ 13 వరకు టి20 ప్రపంచకప్ జరగనుంది. (PC : TWITTER)
2/ 8
అయితే ఈ టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ (West Indies) జట్టులో గందరగోళం నెలకొంది. తమ ప్లేయర్ వ్యవహార శైలిపై ఆగ్రహానికి గురైన వెస్టిండీస్ జట్టు అతడిని ఏకంగా టి20 ప్రపంచకప్ నుంచి వేటు వేసింది. (PC : TWITTER)
3/ 8
టి20 ప్రపంచకప్ కంటే కూడా ముందు ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లు ఈ నెల 5, 7వ తేదీల్లో జరగనున్నాయి. అనంతరం వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. (PC : TWITTER)
4/ 8
ఇక వెస్టిండీస్ జట్టు సూపర్ 12కు నేరుగా చేరలేదు. దాంతో గ్రూప్ స్టేజ్ లో పోటీ పడాల్సి ఉంది. గ్రూప్ బిలో ఉన్న వెస్టిండీస్.. స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వేలతో ఆడాల్సి ఉంది. (PC : TWITTER)
5/ 8
ఇక ఇప్పటికే వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు చేరుకుంది. అయితే షిమ్రన్ హెట్ మైర్ మాత్రం చేరుకోలేదు. రెండు పర్యయాలు అతడు ఫ్లైట్ ను మిస్ చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అతడిపై వేటు వేసింది. (PC : TWITTER)
6/ 8
అతడి స్థానంలో బ్రూక్స్ ను తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వాస్తవానికి హెట్ మైర్ మిగిలిన జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లలేనని తన ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేయాల్సిందిగా బోర్డుకు తెలియజేశాడు. (PC : TWITTER)
7/ 8
అందుకు సమ్మతించిన బోర్డు హెట్ మైర్ ప్రయాణాన్ని సోమవారానికి వాయిదా వేసింది. అతడి కోసం ఫ్లైట్ టికెట్ ను బుక్ చేసింది. అయితే తీరా ప్రయాణం చేసే సమయానికి తాను ఫ్లైట్ అందుకోలేనంటూ మరోసారి బోర్డుకు అతడు సందేశం పంపాడు. (PC : TWITTER)
8/ 8
దీనిపై ఆగ్రహించిన బోర్డు అతడిని మొత్తంగా టి20 ప్రపంచకప్ నుంచే తప్పించేసింది. వెస్టిండీస్ తన తొలి గ్రూప్ మ్యాచ్ ను అక్టోబర్ 17న స్కాట్లాండ్ తో ఆడనుంది. (PC : TWITTER)