T20 World Cup 2022 : 6 బంతులు.. 4 వికెట్లు.. ఇలాంటి ప్లేయర్ ను పక్కన పెడతారా?
T20 World Cup 2022 : 6 బంతులు.. 4 వికెట్లు.. ఇలాంటి ప్లేయర్ ను పక్కన పెడతారా?
T20 World Cup 2022 Schedule : ఇక ఈ ప్రపంచకప్ ముందు భారత్ ను వరుస గాయాలు ఇబ్బంది పెట్టాయి. తొలుత రవీంద్ర జడేజా గాయంతో తప్పుకుంటే.. ఆ తర్వాత బౌలింగ్ కు వెన్నెముకగా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.
టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభమైంది. 15 ఏళ్ల నిరీక్షణకు తెర దించాలనే తలంపుతో ఈ టోర్నీలో టీమిండియా (Team India) బరిలోకి దిగింది. టి20 ప్రపంచకప్ తొలి ఎడిషన్ 2007లో చాంపియన్ గా నిలిచిన భారత్.. మరోసారి ఆ ఘనతను అందుకోలేకపోయింది.
2/ 9
ఇక ఈ ప్రపంచకప్ ముందు భారత్ ను వరుస గాయాలు ఇబ్బంది పెట్టాయి. తొలుత రవీంద్ర జడేజా గాయంతో తప్పుకుంటే.. ఆ తర్వాత బౌలింగ్ కు వెన్నెముకగా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.
3/ 9
దాంతో భారత్ బౌలింగ్ పేలవంగా కనిపించింది. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో బలహీనంగా కనిపించింది. ఇక బుమ్రా స్థానాన్ని చివరి నిమిషంలో షమీ భర్తీ చేశాడు. అయితే అతడి ఫిట్ నెస్ పై చాలా మందికి అనుమానాలు అయితే కలిగాయి.
4/ 9
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్ ద్వారా తన ఫిట్ నెస్ పై వస్తున్న వార్తలకు షమీ చెక్ పెట్టాడు. వాస్తవానికి మొదట షమీ మైదానంలో లేడు. దాంతో అతడి ఫిట్ నెస్ పై అందరిలోనూ అనుమానాలు.
5/ 9
అయితే ఆస్ట్రేలియా గెలుపు కోసం 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో షమీని బౌలింగ్ కు దింపాడు రోహిత్. అంతే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఎలా బౌలింగ్ చేస్తాడో అని అంతా అనుకున్నారు.
6/ 9
అయితే షమీ తనలోని చాంపియన్ బౌలర్ ను బయట పెట్టాడు. తొలి రెండు బంతులకు వరుసగా 2, 2 ఇచ్చిన అతడు.. ఆ తర్వాత చెలరేగిపోయాడు. మూడో బంతిని కమిన్స్ భారీ షాట్ ఆడగా లాంగాన్ లో కోహ్లీ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. (Photo Credit : ICC Instagram)
7/ 9
ఇక తర్వాతి బంతికి అగర్ రనౌట్ అయ్యాడు. ఇక ఐదు, ఆరు బంతులను బుల్లెట్ యార్కర్స్ లా వేశాడు. వాటిని ఎలా ఆడాలో తెలియని ఇంగ్లిస్, రిచర్డ్ సన్ వరుసగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
8/ 9
ఇక ఈ టి20 ప్రపంచకప్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ భారత్ ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా ఉంది.
9/ 9
ఈ మ్యాచ్ లో 6 బంతులు మాత్రమే వేసిన షమీ మూడు వికెట్లు తీయడం విశేషం. అంతేకాకుండా ఒక రనౌట్ లో భాగం అయ్యాడు. షమీని టి20ల్లో కొనసాగించి ఉంటే ఆసియా కప్ లో కూడా టీమిండియా గెలిచి ఉండేది. ఇలాంటి ప్లేయర్ ను టి20లకు దూరం పెట్టడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.