షాహీన్, రవూఫ్ బౌలింగ్ లో అయితే రెచ్చిపోయాడు. తెలివిగా ఆడుతూ పరుగులు సాధించాడు. ముఖ్యంగా రవూఫ్ వేసిన 19వ ఓవర్ లో రవూఫ్ ఎలా బౌలింగ్ చేస్తాడో ముందే పసిగట్టాడు. పూర్తిగా బుద్దిని ఉపయోగిస్తూ ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా బాదాడు. ఇక ఆఖరి ఓవర్లోనూ సూపర్ బ్యాటింగ్ తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.